అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య

by Chintha Aamani |

ఇటీవల అదృశ్యమై మృతిచెందిన ఐకేపీ ఉద్యోగి తీగుళ్ళ నెహ్రూను అతని స్నేహితుడు గామిలీపురం మహేశ్ దారుణంగా హత్యచేసి చంపినట్లుగా గజ్వేల్ రూరల్ సీఐ మహేందర్ రెడ్డి తెలిపారు.

అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య
X

దిశ,ములుగు: ఇటీవల అదృశ్యమై మృతిచెందిన ఐకేపీ ఉద్యోగి తీగుళ్ళ నెహ్రూను అతని స్నేహితుడు గామిలీపురం మహేశ్ దారుణంగా హత్యచేసి చంపినట్లుగా గజ్వేల్ రూరల్ సీఐ మహేందర్ రెడ్డి తెలిపారు. మండల కేంద్రం ములుగులో శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి హత్యకు సంబంధించిన వివరాలు ఎస్సై విజయ్ కుమార్ తో కలిసి వెల్లడించారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం... ములుగుకు చెందిన తీగుళ్ళ నెహ్రూ (35), వర్గల్ మండలం మజీదపల్లి గ్రామానికి చెందిన గామిలీపురం మహేశ్ లు స్నేహితులు వీరిద్దరు కలిసి రియల్ ఎస్టేట్ తో పాటు చిట్ ఫండ్ వ్యాపారం నడిపేవారు. ఈ క్రమంలో వ్యాపారంలో విబేధాలు రావడంతో నెహ్రూపై మహేశ్ కక్ష పెంచుకున్నాడు. మహేశ్ కొండపాకలోని సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో పీఈటీగా విధులు నిర్వహిస్తున్ననిషారాణి,తో గత కొన్నేళ్ళుగా వివాహేతర సంబంధం ఉంది.

గత నెల 28న మహేశ్ నెహ్రూతో కలిసి నిషారాణిని కలిసేందుకు ఆమె ఇంటికి వెళ్ళారు. అక్కడ మహిళ గురించి నెహ్రూ అసభ్యంగా మాట్లాడి ఆమెతో వివాహేతర సంబందం కోరడంతో అప్పటికే నెహ్రూ పట్ల కక్ష పెంచుకున్న మహేశ్ నెహ్రును గట్టిగా కొట్టడంతో అపస్మారక స్థితికి చేరుకోవడంతో అదునుగా భావించిన మహేశ్ నెహ్రూ గొంతుకు వైర్ చుట్టి గట్టిగా నులిమి హత్య చేసినట్లు సీఐ తెలిపారు. అక్కడి నుంచి కారులో మృతదేహాన్ని గాగిళ్ళాపూరు తీసుకువచ్చి నిషారాణి తండ్రి కొమురయ్య సహాయంతో మృతదేహానికి రాళ్ళు కట్టి చెరువులో పడేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అంతకు ముందు నెహ్రూ ఫోన్ నుండి అతని భార్య భరణికి ఉబ్బని వినయ్ ద్వారా ఫోన్ కాల్ చేయించి అన్న రేపు వస్తాడు అంటూ మాట్లాడించాడు. ఈ మేరకు హత్య కేసు నమోదు చేసి నిందితులు మహేశ్, నిషారాణి, కొమురయ్య, ఉబ్బని వినయనలను అదుపులోకి తీసుకొని వీరి నుండి రూ. 58800, రెండు కార్లు, మెటార్ బైక్, నాలుగు ఫోన్లు స్వాధీనం చేసుకొని రిమాండుకు తరలించినట్లు సీఐ తెలిపారు.

Next Story