- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మ్యాన్ హోల్లో బాలుడి మృతదేహం లభ్యం..
మేడ్చల్ జిల్లా ఘాట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి కొండాపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.

దిశ, మేడ్చల్ టౌన్ : మేడ్చల్ జిల్లా ఘాట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి కొండాపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గత రెండు రోజుల క్రితం సంతోష్ (12) మంగలోనికుంట చెరువులో పడిప్రమాదవశాత్తు చెరువులో పడి గల్లంతయ్యాడని అతని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని డీ.అర్.ఎఫ్ టీమ్, గజ ఈతగాలతో 2 రోజుల పాటు చెరువంత జల్లెడ పట్టారు.
ఎంత వెతికినా మృతదేహం లభించలేదు. శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో ఆ చెరువు పక్కనే ఉన్న వాసవి వెంచర్లో ఉన్న ఓ మ్యాన్ హోల్లో బాలుడి మృతదేహం లభించింది. అయితే బాలుడిని ఎక్కడో చంపి ఈ మ్యాన్ హాల్లో పడేశార లేక ఇంకేమైనా కోణం ఉన్నదా అనేది పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురు అనుమానిత వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించి కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.






