- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లి చేసుకో అన్నందుకే హత్య చేసిన ప్రియుడు
దిశ, వెల్గటూర్ : పెళ్లి కోవాలని ప్రియుడితో చెప్పిన ప్రియురాలును దారుణ హత్య చేసిన సంఘటన వెల్గటూర్ పో

దిశ, వెల్గటూర్ : పెళ్లి కోవాలని ప్రియుడితో చెప్పిన ప్రియురాలును దారుణ హత్య చేసిన సంఘటన వెల్గటూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. డీఎస్పీ రఘుచందర్ బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలను వెల్లడించారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్థంభంపల్లిలో మహిళను హత్య చేసిన నిందితుడు నరేష్ (33) ఐదేళ్ల క్రితం ఉపాధి కోసం భార్య, పిల్లలతో హైదరాబాద్ వెళ్లాడు. సుచిత్రలోని ఎస్బీఐ కాలనీలో నివాసం ఉన్నాడు. అదే సమయంలో అతనికి అతినారపు అలివేలుతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ ప్రేమ అక్రమ సంబంధానికి దారి తీసింది. అప్పటికే అలివేలుకు ఇద్దరు కుమారులు ఉన్నారు. తన భర్తతో గొడవల కారణంగా విడాకులు తీసుకున్నది. ఈ క్రమంలో నిందితుని మృతురాలు పరిచయం కాస్త అక్రమ సంబంధంగా మారింది. వీరి అక్రమ సంబంధం నిందితుని మృతురాలు పరిచయం కాస్త అక్రమ సంబంధంగా మారింది. వీరి అక్రమ సంబంధం నిందితుడి భార్యకు తెలియగా.. ఆమె సుమారు రెండేళ్ల క్రితం తల్లిదండ్రుల వద్దకు పిల్లలతో అక్కడే ఉంటున్నది. మృతురాలు తన భార్య పిల్లలను వదిలి తనను పెళ్లి చేసుకోవాలని నిందితుడినీ తరుచుగా ఇబ్బంది పెడుతుండేది.
ఈ క్రమంలోనే నిందితుడి స్వగ్రామం స్తంభంపల్లికి వెళ్లి గొడవ చేస్తుండేది. 2024లో వీరిద్దరికీ డబ్బులు అవసరం ఉండగా..మంచిర్యాలలో కూసలక్ష్మీ (55) మహిళ ను ఇద్దరు కలిసి చంపి ఆమె వద్ద ఉన్న బంగారాన్ని దోచుకొని వెళ్లారు. ఆ హత్య కేసులో ఈ ఏడాది నేరస్తులు నరేష్, అలివేలును మంచిర్యాల పోలీసులు అరెస్ట్ చేసి ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించారు. వీరిద్దరూ జైలు నుంచి మూడు నెలల కిందట విడుదల అయ్యారు. డిసెంబర్ 09న మృతురాలు స్తంభంపల్లి గ్రామంలోని నిందితుడి ఇంటికి వచ్చింది. ఇక నుంచి తాను ఇక్కడే ఉంటానని.. తనను పెళ్లి చేసుకోవాలని లేదంటే తన చావుకు నిందితుడి కుటుంబ సభ్యులే కారణమని లేఖ రాసి అతని ఇంటి ముందు ఉన్న బావిలో దూకి చనిపోతానని బెదిరించింది. అలాగే నరేష్ తో గొడవకు దిగింది. దీంతో ఆగ్రహానికి గురైన నరేష్ ఎలాగైనా అలివేలు ని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయింకున్నాడు. చంపాలనే ఉద్దేశంతో అక్కడే ఉన్న రోకలిబండ మృతురాలు తలపై బలంగా బాదాడు. దీంతో తీవ్ర గాయమై మృతురాలు అక్కడికక్కడే మృతి చెందింది. ఆ తరువాత నిందితుడు వెల్గటూర్ పోలీస్ స్టేషన్ కి వచ్చి లొంగిపోయాడు. ఈ ఘటన పై ఎస్సై ఉదయ్ కుమార్ కేసు నమోదు చేశాడు. ధర్మపురి సీఐ రాం నర్సింహారెడ్డి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా మృతురాలిని చంపడానికి ఉపయోగించిన రోకలిబండ, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు నరేష్ ని రిమాండ్ కోసం ధర్మపురి ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచినట్టు డీఎస్పీ రఘుచందర్ తెలిపారు.






