నెట్టింట ఫేమ్ అయ్యేందుకు బ్రిడ్జి ఎక్కిన బాలుడు.. ఊహించని షాక్ తగిలి..!

by Disha Web Desk 9 |
నెట్టింట ఫేమ్ అయ్యేందుకు బ్రిడ్జి ఎక్కిన బాలుడు.. ఊహించని షాక్ తగిలి..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ఫొటోలు, వీడియోల కోసం.. వింత వింత చేష్టలతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనే స్ట్రీట్ రేసింగ్, గ్రాఫిటీ, అక్రమ టేకోవర్లకు హాట్ స్పాట్‌గా మారిన లాస్ ఏంజిల్స్‌లో జరిగింది. 17 ఏళ్ల ఓ బాలుడు బ్రిడ్జి ఎక్కి స్టంట్ చేస్తుండగా కాలు జారి కింద పడ్డాడు. దీంతో పిల్లాడికి తీవ్ర గాయాలవ్వడంతో అక్కడే ఉన్న స్థానికులు అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో బాలుడు చికిత్స పొందుతూ చనిపోయాడని లాస్ ఏంజిల్స్ పోలీస్ చీఫ్ మైఖేల్ మూర్ వెల్లడించారు.

Next Story