వైద్యం వికటించి బాలుడు మృతి

by Ratna Kumari |

వైద్యుల నిర్ల‌క్ష్యం కార‌ణంగా ఓ బాలుడు మృతి చెందాడు. ఈ దారుణ ఘ‌ట‌న భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా భ‌ద్రాచ‌లంలో చోటు చేసుకుంది.

వైద్యం వికటించి బాలుడు మృతి
X

దిశ భద్రాచలం : వైద్యుల నిర్ల‌క్ష్యం కార‌ణంగా ఓ బాలుడు మృతి చెందాడు. ఈ దారుణ ఘ‌ట‌న భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా భ‌ద్రాచ‌లంలో చోటు చేసుకుంది. పాత ఎల్ఐసీ రోడ్డులోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రిలో 17 నెల‌ల బాబుకి హెర్నియా ఆప‌రేష‌న్ పేరుతో అధిక మోతాదులో మ‌త్తు ఇంజ‌క్ష‌న్ ఇవ్వ‌డంతో బాలుడు కోమాలోకి వెళ్లిన‌ట్టు స‌మాచారం. బాలుడిని విజ‌య‌వాడ‌కు త‌ర‌లించిన‌ప్ప‌టికీ.. బ్రెయిన్ కి స‌రైన ఆక్సిజ‌న్ అంద‌క‌పోవ‌డంతో ప‌రిస్థితి విష‌మించి బాలుడు మృతి చెందిన‌ట్టు తెలుస్తోంది. త‌ల్లిదండ్రుల తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మ‌త్తు ఇంజ‌క్ష‌న్ అధిక మోతాదులో ఇవ్వ‌డంతో పాటు స‌రైన చికిత్స అందించ‌క‌పోవ‌డంతో ప‌సి బాలుడు కోమాలోకి వెళ్లాడ‌ని తెలిపారు. విజ‌య‌వాడ‌లో కూడా మెరుగైన వైద్యం అందించ‌లేద‌ని ఆరోపిస్తున్నారు బాలుడి త‌ల్లిదండ్రులు. త‌మ ప‌సి బాలుడు మృతికి కార‌కులైన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత అధికారులు ఈ ఘ‌ట‌న పై విచార‌ణ చేప‌ట్టి వాస్త‌వాల‌ను వెలికి తీయాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

Next Story