- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Love Marriage: మీ అమ్మాయితో వెంటనే పెళ్లి చేయండి.. అర్థరాత్రి బాలిక తండ్రిని పొడిచిన బాలుడు
మైనారిటీ తీరని అమ్మాయితో వెంటనే పెళ్లి చేయాలని ఓ బాలుడు బీభత్సం సృష్టించాడు. అమ్మాయి ఇంటి ఎదుట నానా హంగామా చేశాడు.

దిశ, వెబ్‌డెస్క్ : మైనారిటీ తీరని అమ్మాయితో వెంటనే పెళ్లి చేయాలని ఓ బాలుడు బీభత్సం సృష్టించాడు. అమ్మాయి ఇంటి ఎదుట నానా హంగామా చేశాడు. అయినా అటు ప్రేమించిన అమ్మాయి, ఇటు ఆమె తండ్రి పెళ్లికి నిరాకరించడంతో హత్యాయత్నం చేశాడు. బాలిక తండ్రిపై కత్తెరతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఆదివారం అర్థరాత్రి నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన 16 ఏళ్ల బాలుడు పట్టణంలో తాపీ పనులు చేసుంటున్నాడు. అతడు నివాసం ఉండే వీధిలోనే ఉంటున్న 16 ఏళ్ల బాలికతో ప్రేమలో పడ్డాడు. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని ఆ బాలికను కోరాడు. దానికి ఆమె నిరాకరించడంతో నేరుగా ఆదివారం బాలిక ఇంటికి వెళ్లిన అబ్బాయి.. ఆమె తండ్రితో పెళ్లి చేయాలని గొడవకు దిగాడు. అయితే ఇద్దరికీ మైనారిటీ తీరలేదని మరో నాలుగేళ్లు ఆగితే పెళ్లి చేస్తామని ఎంత నచ్చజెప్పినా బాలుడు ఆగలేదు. వెంటనే తమ ఇద్దరికీ వివాహం చేయాలని పట్టుబట్టాడు. అయినా అమ్మాయి తండ్రి ఒప్పుకోకపోవడంతో ఇంటి ముందు రచ్చరచ్చ చేశాడు.
పెళ్లి వయసు వచ్చాకమాట్లాడుకుందాం అని బాలిక తండ్రి చెప్పినా పట్టించుకోలేదు. ఇప్పుడు వివాహం చేయకపోతే ప్రియురాలు తనకు దక్కదని భావించిన బాలుడు అదే కోపంలో తన స్నేహితుడైన వైఎస్సార్ కాలనీకి చెందిన తౌసిఫ్ ఉల్లా (20)తో కలిసి అర్థరాత్రి బాలిక ఇంటికి వచ్చి ఆమె తండ్రిపై కత్తెరతో పొడిచి దాడి చేశాడు. ఈ ఊహించని ఘటనలో బాలిక తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు రావడంతో తౌసిఫ్ ఉల్లా సహా బాలుడు పరారీ అయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే బాలిక తండ్రిని నిజమాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందిందని నిర్మల్ సబ్ డివిజన్ ఏఎస్పీ రాజేశ్ మీనా తెలిపారు. పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. దాడికి పాల్పడిన ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు.






