చెరువులో గ‌ల్లంతు అయిన‌ యువకుడి మృతదేహం లభ్యం

by Ratna Kumari |   (  Updated:2025-11-01 11:51:02  IST  )

దిశ, నారాయణపేట క్రైమ్ : నారాయణపేట జిల్లా కేంద్రంలోని కొండారెడ్డిపల్లి చెరువులో ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. వివరాల్లోకి వెళ్లితే... జిల్లా కేంద్రంలోని పల్లా వీధికి చెందిన గడ్డం శివరాజ్ (25) వృత్తి రీత్యా

చెరువులో గ‌ల్లంతు అయిన‌ యువకుడి మృతదేహం లభ్యం
X

దిశ, నారాయణపేట క్రైమ్ : నారాయణపేట జిల్లా కేంద్రంలోని కొండారెడ్డిపల్లి చెరువులో ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. వివరాల్లోకి వెళ్లితే... జిల్లా కేంద్రంలోని పల్లా వీధికి చెందిన గడ్డం శివరాజ్ (25) వృత్తి రీత్యా కార్పెంటర్ పనితో పాటు వ్యవసాయం చేసేవాడు. గత 24 గంటల వ్యవధి అయిన కుటుంబ సభ్యులకు శివరాజ్ కనిపించలేదు. ఉన్నట్టుండి కొండారెడ్డిపల్లి చెరువులో శవమై స్థానికులకు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. యువకుడు మృతి చెంది 24 గంటలు దాటి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. యువకుడి మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున చెరువు వద్దకు చేరుకున్నారు. శివరాజ్ మృతదేహాన్ని చూసి తల్లి కన్నీరు మున్నీరైంది. ఘటన పై నారాయణపేట పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Next Story