- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువకుని మృతదేహం లభ్యం
మంథని మండలం గాడిదలగండి గుట్ట సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఆదివారం ఉదయం కుళ్లిన స్థితిలో ఓ యువకుని మృతదేహం లభ్యమైంది.

దిశ, మంథని : మంథని మండలం గాడిదలగండి గుట్ట సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఆదివారం ఉదయం కుళ్లిన స్థితిలో ఓ యువకుని మృతదేహం లభ్యమైంది. రామగిరి మండలం సింగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన జూల వంశీ అనే యువకుని మృత దేహంగా గుర్తించినట్లు తెలుస్తోంది.గత నెలలో యువకుడు మిస్సింగ్ అయినట్టు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో యువకుని కుటుంబ సభ్యులు పిర్యాదు చేసినట్లు సమాచారం. దొరికిన మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. యువకుని మృతి పై స్థానికుల నుండి పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దళిత కులానికి చెందిన యువకున్ని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. యువకుని కుటుంబ సభ్యులు,దళిత సంఘాలు రోడ్డు పై ధర్నా దిగారు.మృతుని కుటుంబ సభ్యులకు పోలీస్ లు న్యాయం చేస్తామని చెప్పడంతో ధర్నా విరమించారు.






