- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మానుకోటలో గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలం..!
పట్టణంలోని నర్సంపేట రోడ్డులో ఓ షోరూం సమీపంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమవడం స్థానికంగా కలకలం రేపింది.

X
దిశ, మహబూబాబాద్ ప్రతినిధి : పట్టణంలోని నర్సంపేట రోడ్డులో ఓ షోరూం సమీపంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమవడం స్థానికంగా కలకలం రేపింది. శుక్రవారం ఉదయం రోడ్డు పక్కన మహిళ అనుమానాస్పద స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి వయస్సు సుమారు 55 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే ఆమె ఎవరు..? ఎక్కడికి చెందినవారు..? అనే విషయాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనారోగ్య కారణాలతో మృతి చెందిందా..? లేక ఇతర అనుమానాస్పద పరిస్థితులున్నాయా..? అనే కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.
Next Story






