- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దుర్గం చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యక్తి మృతదేహం లభ్యం..
by Batti.Sumithra |
మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యక్తి మృతదేహం వెలికితీశాయి డీఆర్ఎఫ్ బృందాలు.

X
దిశ, శేరిలింగంపల్లి : మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పై నుంచి దూకి గత శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యక్తి మృతదేహం వెలికితీశాయి డీఆర్ఎఫ్ బృందాలు. గత రెండు రోజుల క్రితం దుర్గం చెరువులో దూకిన వ్యక్తిని నల్గొండ జిల్లా సూర్యాపేటకు చెందిన వెంకట నరసింహారెడ్డి (31)గా పోలీసులు గుర్తించారు.
మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ తరలించారు. ఆత్మహత్యకు గల కారణాల పై దర్యాప్తు చేపట్టినట్లు మాదాపూర్ పోలీసులు తెలిపారు. శనివారం మధ్యాహ్నం దుర్గం చెరువులో దూకిన వ్యక్తి కోసం రెండు రోజులుగా తీవ్రంగా శ్రమించాయి డీఆర్ ఎఫ్ బృందాలు. రెండు బృందాలుగా ఏర్పడ్డ 12 మంది సిబ్బంది రెండు రోజులపాటు గాలించాయి.
Next Story






