- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన నిందితుడి అరెస్ట్.. విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)పై దాడి కేసు విచారణలో నెవ్వెరపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)పై దాడి కేసు విచారణలో నెవ్వెరపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. కేసును సవాలు తీసుకున్న ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు (Mumbai Crime Branch Police) గంటల వ్యవధిలోనే నిందితుడిని అరెస్ట్ చేశారు. నేరుగా నిందితుడిని బాంద్రా పోలీస్ స్టేషన్ (Bandra Police Station)కు తీసుకెళ్లి విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే నిందితుడు పోలీసులు సంచలన నిజాలు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)పై దాడి చేసే ముందు బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ (Shahrukh Khan) ఇంటిపైనా రెక్కీ చేసినట్లుగా దుండగుడు స్టేట్‌మెంట్ ఇచ్చాడు. కానీ, ఆ ఇంటికి బలమైన భద్రతా వ్యవస్థ ఉండటంతో చోరబడటం కష్టమని భావించిన నిందితుడు చివరి నిమిషంలో తన ప్లాన్‌ను మార్చుకున్నట్లుగా పోలీసులకు వెల్లడించారు. అదే సమయంలో సైఫ్ ఉంటున్న ఇంట్లో ఎలాంటి సెక్యూరిటీ లేకపోవడంతోనే తాను ఆ ఇంట్లోకి చొరబడినట్లుగా దుండగుడు విచారణలో వెల్లడించినట్లుగా తెలుస్తోంది.






