- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బైకర్, పాదచారులపైకి దూసుకెళ్లిన థార్.. సీసీటీవీ ఫుటేజీలో షాకింగ్ విజువల్స్
రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జలుపురా పోలీస్ స్టేషన్ పరిధిలో వేగంగా దూసుకొచ్చిన థార్ ఎస్‌యూవీ అదుపు తప్పి బీభత్సం సృష్టించింది.

దిశ, వెబ్‌డెస్క్: రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జలుపురా పోలీస్ స్టేషన్ పరిధిలో వేగంగా దూసుకొచ్చిన థార్ ఎస్‌యూవీ అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న యువకుడు ఫహీమ్ అక్కడికక్కడే మృతి చెందగా, ఓ యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దారుణ ఘటన మొత్తం సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది. ఫుటేజీ ప్రకారం.. వేగంగా వచ్చిన థార్ వాహనం ముందుగా ఓ బైక్‌ను ఢీకొట్టడంతో దానిని నడుపుతున్న యువకుడు గాల్లోకి ఎగిరిపడ్డాడు. అనంతరం రోడ్డుపై నడుస్తున్న ఓ పాదచారిని బలంగా ఢీకొట్టగా ఆమె తీవ్రగాయాలతో పక్కకు పడిపోయింది. చివరకు అదుపు తప్పిన వాహనం రోడ్డుపక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ఆగింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని యువతిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఫహీమ్ మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కు పంపారు.
ఈ ప్రమాదానికి కారణమైన థార్ డ్రైవర్ మనీష్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రమాదానికి అసలు కారణం ఏంటన్న దానిపై ఆరా తీస్తున్నారు. మద్యం సేవించి వాహనం నడిపాడా? అతివేగమే కారణమా? అన్న కోణాల్లో దర్యాప్తు సాగుతోంది. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను పోలీసులు ఫ్రేమ్ టు ఫ్రేమ్ పరిశీలిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరి తప్పు ఉందన్నదాన్ని ఖచ్చితంగా నిర్ధారించేందుకు విచారణ కొనసాగుతోంది.






