ధర్మవరంలో ఉగ్ర కదలికలు.. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న NIA

by Kema Shiva Kumar |

ఇటీవల విజయనగరం జిల్లాలో ఉగ్రవాద సానుభూతిపరుడు సిరాజ్‌ ఉర్‌ రెహ్మాన్‌తో పాటు హైదరాబాద్‌లోని అతడి స్నేహితుడిని పోలీసులు అరెస్టు ఉగ్ర కుట్రను భగ్నం చేసిన విషయం తెలిసిందే.

ధర్మవరంలో ఉగ్ర కదలికలు.. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న NIA
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల విజయనగరం జిల్లాలో ఉగ్రవాద సానుభూతిపరుడు సిరాజ్‌ ఉర్‌ రెహ్మాన్‌తో పాటు హైదరాబాద్‌లోని అతడి స్నేహితుడిని పోలీసులు అరెస్టు ఉగ్ర కుట్రను భగ్నం చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ విషయం మరువక ముందే ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం (Dharmavaram)లో ఉగ్రవాదుల కదిలికలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ మేరకు ఇవాళ నూర్ (Noor) అనే వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు (NIA) అదుపులోకి తీసుకున్నారు. అయితే, అతడు ధర్మవరం కోట కాలనీలో ఉండగా అరెస్ట్ చేశారు. అనిమానితుడు నూర్ ఓ హోటల్‌లో వంట మనిషిగా విధులు నిర్వర్తిస్తున్నట్లుగా గుర్తించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులతో నూర్‌ సంబంధాలపై ఎన్ఐఏ ఆరా తీస్తోంది. అతడు నివాసం ఉంటున్న గదిలో సోదాలు చేపట్టగా ఏకంగా 16 సిమ్ కార్టులు లభించాయి. అనంతరం వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా నూర్ సోషల్ మీడియా అకౌంట్లపై కూడా ఎన్ఐఏ అధికారులు ఫోకస్ పెట్టి కీలక విషయాలు రాబట్టే పనిలో ఉన్నారు.

Next Story