హజరత్‌బల్‌లో ఉగ్ర నెట్‌వర్క్ గుట్టురట్టు: మహిళతో పాటు నలుగురు అరెస్ట్

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-23 04:38:54  IST  )

జమ్మూకశ్మీర్‌లోని హజరత్‌బల్ ప్రాంతంలో ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తూ సహకరిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

హజరత్‌బల్‌లో ఉగ్ర నెట్‌వర్క్ గుట్టురట్టు: మహిళతో పాటు నలుగురు అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్‌ (Jammu Kashmir)లో టెర్రరిస్టులను ఏరివేసే ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. తాజాగా శ్రీనగర్‌లోని హజరత్‌బల్ (Hazratbal) ప్రాంతంలో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ, వారికి రవాణా, నిధుల రూపంలో సహాయం చేస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, అరెస్టయిన వారిలో ముగ్గురు పురుషులతో పాటు ఓ మహిళ కూడా ఉన్నట్లుగా పోలీసులు ధృవీకరించారు. వీరంతా స్థానికంగా ఉగ్రవాదులకు రహస్య స్థావరాలను ఏర్పాటు చేయడంతో పాటు, భద్రతా దళాల కదలికలపై సమాచారాన్ని అందిస్తున్నట్లు విచారణలో తేలింది.

సామగ్రి స్వాధీనం..

ఈ మేరకు నిందితుల స్థావరాలపై దాడులు నిర్వహించిన సమయంలో పోలీసులు భారీగా యుద్ధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అందులో ఒక హ్యాండ్ గ్రనేడ్, ఏకే-47 రైఫిల్‌తో పాటు బుల్లెట్లు, భారీగా నగదు, కీలక సమాచారం ఉన్న పలు మొబైల్ ఫోన్లు లభ్యమయ్యాయి. ముందస్తు సమాచారంతో పోలీసులు, భద్రతా దళాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. అరెస్టయిన నిందితులు ఏ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు కలిగి ఉన్నారనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Next Story