- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పట్టపగలే విజయవాడలో టెర్రర్.. కార్డెన్ సెర్చ్ చేస్తుండగా పోలీసులపైకి కాల్పులకు యత్నం
విజయవాడ బాలాజీ హోటల్‌లో పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఓ దుండగుడు ఏకంగా గన్‌తో కాల్పులు జరిపేందుకు యత్నించాడు.

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ నగరంలో ఇవాళ ఉదయం పెను ప్రమాదం తప్పింది. పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తుండగా ఓ దుండగుడు ఏకంగా పోలీసులపైకే కాల్పులు జరిపేందుకు ప్రయత్నించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అదృష్టవశాత్తూ సాంకేతిక కారణాల వల్ల తుపాకీ పేలకపోవడంతో పోలీసులు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
పోలీసుల కథనం మేరకు.. నగరంలోని బాలాజీ హోటల్‌లో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఓ గదిలో ఉన్న వ్యక్తిపై అనుమానం వచ్చి పోలీసులు విచారిస్తుండగా, అతను అకస్మాత్తుగా తన వద్ద ఉన్న తుపాకీ తీసి పోలీసుల వైపు గురిపెట్టాడు. అనంతరం వారిని కాల్చాలనే ఉద్దేశంతో ట్రిగ్గర్ నొక్కాడు. అయితే, దుండగుడు ట్రిగ్గర్ నొక్కినప్పటికీ, గన్‌కు ఉన్న ’ట్రిగ్గర్ లాక్’ అవ్వడంతో బుల్లెట్ బయటకు రాలేదు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సదరు దుండగుడిని చకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా నిందితుడి నుంచి 9 ఎంఎం తుపాకీతో పాటు మొత్తం ఐదు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అసలు ఆ వ్యక్తి ఎవరు..,హోటల్ గదిలో తుపాకీతో ఎందుకు ఉన్నాడు..? పోలీసులపై కాల్పులు జరపాల్సిన అవసరం ఏమొచ్చింది..? అనే కోణంలో పోలీసులు ప్రాథమికంగా నిందితుడిని విచారిస్తున్నారు.






