- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బైక్ కొనివ్వలేదని యువకుని ఆత్మహత్య
బైక్ కొనివ్వలేదన్న కారణంతో ఓ పదవ తరగతి విద్యార్థి పురుగుల మందు తాగి మృతిచెందిన ఘటన వీణవంక మండలంలో జరిగింది.

X
దిశ, వీణవంక: బైక్ కొనివ్వలేదన్న కారణంతో ఓ పదవ తరగతి విద్యార్థి పురుగుల మందు తాగి మృతిచెందిన ఘటన వీణవంక మండలంలో జరిగింది. ఇప్పలపల్లి గ్రామానికి చెందిన చుక్క ఆదిత్య అనే యువకుడు ఇల్లంతకుంట మండలంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. ఇటీవల సెలవుల సందర్భంగా ఇంటికి వచ్చిన ఆదిత్య, తండ్రిని బైక్ కొని ఇవ్వమని అడిగాడు. అయితే తల్లిదండ్రులు కొద్దిరోజుల్లో కొంటామని చెప్పి నచ్చజెప్పారు.
వాళ్ల మాట వినకుండా ఆదిత్య జూలై 20న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతడిని వెంటనే కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం ఆదిత్య మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ఆవుల తిరుపతి తెలిపారు.
Next Story






