- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కన్నతండ్రి చేతిలో టెన్నిస్ క్రీడాకారిణి దారుణ హత్య
టెన్నిస్ గ్రాండ్ స్లామ్ వింబుల్డన్ కోసం టెన్నిస్ అభిమానులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్న తరుణంలో.. షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: టెన్నిస్ గ్రాండ్ స్లామ్ వింబుల్డన్ కోసం టెన్నిస్ అభిమానులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్న తరుణంలో.. షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గురుగ్రామ్ కు చెందిన యువ టెన్నిస్ క్రీడాకారిణి రాధిక యాదవ్ హత్యకు (Tennis Player Radhika Yadav) గురైంది. ఆమె తండ్రే రివాల్వర్‌తో కాల్చి హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. హర్యానాలోని గురుగ్రామ్‌లో సుశాంత్ లోక్ ఫేజ్ -2 అనే పోష్ సొసైటీలో రాధిక యాదవ్ తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఫ్లాట్ నంబర్ E-157లో రాధిక యాదవ్ హత్య జరిగింది. ఆ ప్రాంతంలో చాలాకాలంగానే వారి కుటుంబం నివసిస్తోంది.
గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో తండ్రి.. రాధికపై కాల్పులు జరపగా తీవ్రంగా గాయపడింది. రక్తపుమడుగులో పడి ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మరణించినట్లు డాక్టర్లు ప్రకటించారు. అయితే రాధిక హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కుటుంబ సమస్యలా ? లేక మరేదైనా కారణమా? అన్నది తండ్రిని విచారించిన తర్వాత వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.






