- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు ప్రమాదంలో పది మందికి గాయాలు
by Kema Shiva Kumar |
ఆటో బ్రేకులు ఫెయిలై చెట్టుకు ఢీకొట్టిన ఘటనలో పది మందికి గాయాలైన ఘటన చేగుంట మండల పరిధిలోని బోనాల గ్రామం వద్ద సోమవారం చోటుచేసుకుంది.

X
పెళ్లి బట్టల కోసం ఆటోలో వెళ్తుండగా ప్రమాదం
రామాయంపేట ప్రభుత్వాసుపత్రిలో క్షతగాత్రులకు చికిత్స
దిశ చేగుంట : ఆటో బ్రేకులు ఫెయిలై చెట్టుకు ఢీకొట్టిన ఘటనలో పది మందికి గాయాలైన ఘటన చేగుంట మండల పరిధిలోని బోనాల గ్రామం వద్ద సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన ఓ కుటుంబం త్వరలో తమ ఇంట్లో జరగనున్న పెళ్లి వేడుక కోసం నూతన వస్త్రాలు కొనుగోలు చేసేందకు ఆటోలో రామాయంపేటకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆటో మండల పరిధిలోని బోనాల గ్రామ శివారు వద్దకు రాగానే బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో అదుపు తప్పి చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన పదిమందికి గాయాలు కాగా, క్షతగాత్రులను 108 వాహనంలో రామాయంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Next Story






