- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సౌతాఫ్రికాలో కుప్పకూలిన ఆలయం.. భారత సంతతి వ్యక్తితో సహా నలుగురు మృతి
సౌతాఫ్రికా (South Africa) క్వాజులు-నటాల్ ప్రావిన్స్‌లోని నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్థుల న్యూ అహోబిలం ఆలయం (New Ahobilam Temple) కుప్పకూలింది.

దిశ, వెబ్‌డెస్క్: సౌతాఫ్రికా (South Africa) క్వాజులు-నటాల్ ప్రావిన్స్‌లోని నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్థుల న్యూ అహోబిలం ఆలయం (New Ahobilam Temple) కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో మొత్తం నలుగురు అక్కడికక్కడే మరణించారు ఈ ఆలయం డర్బన్ నగరానికి ఉత్తరాన రెడ్‌క్లిఫ్ ప్రాంతంలోని వేరులం సమీపంలో ఉంది. నిర్మాణ సమయంలో భవనం ఒక భాగం కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఆలయాన్ని గుహ ఆకృతిలో నిర్మిస్తున్నారు. ఇందుకు భారత్ నుంచి తెచ్చిన రాళ్లు, స్థలంలో తవ్విన రాళ్లను ఉపయోగించారు. ఈ ఆలయ నిర్మాణం పూర్తయితే ప్రపంచంలోనే అతి పెద్ద శ్రీ నరసింహ దేవుడి విగ్రహం ఇక్కడే ఉండేది. మరణించిన వారిలో భారత సంతతి వ్యక్తి విక్కీ జైరాజ్ పాండే (Vicky Jairaj Pandey) ఉన్నారు. ఆయన న్యూ అహోబిలం ఆలయ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా, ఆలయ నిర్మాణ ప్రాజెక్ట్ మేనేజర్ కొనసాగుతున్నారు. స్పాట్‌లో వాతావరణ అనుకూలించకపోవడంతో ప్రస్తుతానికి రెస్క్యూ ఆపరేషన్ నిలిపివేశారు.






