- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమ్మాయి న్యూడ్ వీడియో కాల్ చేసిందని సంబురపడ్డాడు.. చివర్లో ఇచ్చిన ట్విస్ట్‌కు నోరెళ్లబెట్టాడు!
పెరుగుతున్న టెక్నాలజీ ఎంతమందికి ఉపయోగపడుతుందో తెలియదు కానీ.. అనేకమంది కొంప ముంచుతోంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: పెరుగుతున్న టెక్నాలజీ ఎంతమందికి ఉపయోగపడుతుందో తెలియదు కానీ.. అనేకమంది కొంప ముంచుతోంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. దేశంలో రోజుకోచోట సైబర్ మోసాలు(Cyber Frauds) వెలుగుజూస్తున్నాయి. ఇలాంటి ఘటనలపై పోలీసులు, అధికారులు అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తున్నా.. మార్పు రావడం లేదు. తాజాగా.. సైబర్ మోసాలపై అవగాహన కల్పించేలా తెలంగాణ పోలీసులు(Telangana Police) సోషల్ మీడియా వేదికగా ఓ ఆసక్తికరమైన పోస్టు పెట్టారు.
‘సోషల్ మీడియా స్నేహాలతో జాగ్రత్త ఉండాలి. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే రిక్వెస్టులను యాక్సెప్ట్ చేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. అపరిచితులకు అస్సలు మీ వ్యక్తిగత వివరాలు చెప్పొద్దు. వారికి ఫోన్ నంబర్లు కూడా ఇవ్వొద్దు. పెరిగిపోతున్న సైబర్ నేరాలపై మీ సన్నిహితులకు అవగాహన కల్పించండి’ అని పేర్కొన్నారు. అంతేగాకుండా.. బీటెక్ చేస్తోన్న యువకుడికి ఫేస్‌బుక్‌లో ఓ అమ్మాయి పరిచయం అయింది. అది కాస్త ప్రేమకు దారి తీసింది. ఈ క్రమంలోనే రోజూ సదరు యువకుడితో న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడేది. చివరకు యువకుడి న్యూడ్ వీడియోలు రికార్డ్ చేసి.. బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది. దిక్కుతోచని స్థితిలో బాధిత యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. అందుకే తెలియని వ్యక్తుల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.






