Telangana Police: రాష్ట్రంలోని ప్రతీ ఇంట్లో ఆ అంశంపై చర్చ జరగాలి

by Gantepaka Srikanth |

మారుతున్న కాలం, పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగానే సైబర్ నేరాలు(Cyber Crimes) కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి.

Telangana Police: రాష్ట్రంలోని ప్రతీ ఇంట్లో ఆ అంశంపై చర్చ జరగాలి
X

దిశ, వెబ్‌డెస్క్: మారుతున్న కాలం, పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగానే సైబర్ నేరాలు(Cyber Crimes) కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. రోజూ కొత్త కొత్త మార్గాల ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా సైబర్ మోసాలపై అవగాహన కల్పించేలా తెలంగాణ పోలీసులు(Telangana Police) కొన్ని సూచనలు చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ‘‘మీ కుటుంబం సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేందుకు మీరే తగిన జాగ్రత్తలు తీసుకోండి. సరదాగా కుటుంబమంతా కూర్చున్నప్పుడు సైబర్ మోసాల గురించి అవగాహన కల్పించండి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మోసాలు ఎలా జరుగుతాయని వివరించండి. మీ కుటుంబానికి మీరే రక్షకులుగా నిలవండి’ అని పేర్కొన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా వీడియో రూపొందించారు. వీడియోలో పేర్కొన్న అంశాలపై తెలంగాణలోని ప్రతీ ఇంట్లో చర్చ జరగాలని సూచించారు.

Next Story