Telangana Police: ఎట్టిపరిస్థితుల్లో వారికి ATM పిన్ నంబర్ చెప్పొద్దు

by Gantepaka Srikanth |

చోరీలు చేసేవారికి మానవత్వం ఉండదు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా.. ఉన్నోడా? లేనోడా? అనే భేదాలేవీ చూడకూండా దోచేస్తుంటారు.

Telangana Police: ఎట్టిపరిస్థితుల్లో వారికి ATM పిన్ నంబర్ చెప్పొద్దు
X

దిశ, వెబ్‌డెస్క్: చోరీలు చేసేవారికి మానవత్వం ఉండదు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా.. ఉన్నోడా? లేనోడా? అనే భేదాలేవీ చూడకూండా దోచేస్తుంటారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఏటీఎం సెంటర్(ATM Centers) వద్ద జరిగే చోరీలు పెరిగిపోయాయి. అమాయకంగా అక్కడక్కడే తిరుగుతూ.. సాయం చేస్తామంటూ నమ్మంచి భారీ మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ పోలీసులు(Telangana Police) హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘ఏటీఎం సెంటర్ల దగ్గర అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. డబ్బు విత్ డ్రా చేసేందుకు సహాయం చేస్తామంటూ ఎవరైనా మాట కలిపితే తిరస్కరించండి. మీ కార్డును ఎట్టిపరిస్థితుల్లో వారికి ఇవ్వొద్దు, ఏటీఎం పిన్(ATM Pin) నంబర్ చెప్పొద్దు’ అని నెట్టింట పేర్కొన్నారు.

Next Story