- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గోవాలో తెలంగాణ నార్కోటిక్ బ్యూరో భారీ ఆపరేషన్.. ఆ ఇద్దరు డాక్టర్ల బాగోతం బట్టబయలు
గోవా(Goa)లో తెలంగాణ నార్కోటిక్ బ్యూరో(Telangana Narcotics Bureau) అధికారులు భారీ ఆపరేషన్ చేపట్టారు.

దిశ, వెబ్‌డెస్క్: గోవా(Goa)లో తెలంగాణ నార్కోటిక్ బ్యూరో(Telangana Narcotics Bureau) అధికారులు భారీ ఆపరేషన్ చేపట్టారు. ఈ సందర్భంగా పలు డ్రగ్స్(Drugs) ముఠాలను పట్టుకున్నారు. ఇద్దరు డీజేలతో పాటు పలువురు నిందితులను అరెస్ట్ చేశారు. మొత్తం 70 మంది డ్రగ్స్ పెడ్లర్స్ స్థావరాలపై దాడులు నిర్వహించారు. రూ.1.25 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. హవాలా మార్గంలో డ్రగ్స్ ముఠాకు డబ్బులు చెల్లిస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్‌లో ఇద్దరు డాక్టర్లకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టూ గుర్తించారు. గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు తెలిపారు. గోవాలో ఆల్ప్రాజోలం తయారుచేస్తున్న మరో ముఠాను అదుపులోకి తీసుకున్నారు. గోవాలోని సూర్యప్రభ ఫార్మా కంపెనీపై దాడులు చేశారు. భారీగా ఆల్ప్రాజోలం స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






