ఒడిశాలో తెలంగాణ ఈగల్ టీమ్ భారీ ఆపరేషన్

by Ajay Maddhiboyina |

ఒడిశాలో తెలంగాణ ఈగ‌ల్ టీమ్ భారీ ఆప‌రేష‌న్ చేప‌ట్టింది. గంజాయి ముఠా కోసం ఈగ‌ల్ టీమ్ భారీ ఛేజింగ్ చేసి నిందితుల‌ను ప‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నించింది. సి

ఒడిశాలో తెలంగాణ ఈగల్ టీమ్ భారీ ఆపరేషన్
X

దిశ, వెబ్ డెస్క్: ఒడిశాలో తెలంగాణ ఈగ‌ల్ టీమ్ భారీ ఆప‌రేష‌న్ చేప‌ట్టింది. గంజాయి ముఠా కోసం ఈగ‌ల్ టీమ్ భారీ ఛేజింగ్ చేసి నిందితుల‌ను ప‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నించింది. సినిమా రేంజ్ లో ఈగ‌ల్ టీం వెంబ‌డించ‌డంతో నిందితులు బొలెరో వాహ‌నాన్ని వ‌దిలేసి అక్క‌డ నుండి పారిపోయారు. బొలెరో వాహ‌నంతో పాటు 500 కేజీల గంజాయిని ఈగ‌ల్ టీం స్వాధీనం చేసుకుంది. ఒడిశాలోని కోరాపోట్ అడ‌వుల్లో నుండి తెలంగాణ‌కు గంజాయి స్మ‌గ్లింగ్ చేస్తున్నార‌నే ప‌క్కా స‌మాచారం ఉండ‌టంతో ఈగ‌ల్ టీం రంగంలోకి దిగి ఈ ఆప‌రేష‌న్ చేప‌ట్టింది. ఇక ఇప్ప‌టికే రాష్ట్రంలో గంజాయి, డ్ర‌గ్స్ నిర్మూల‌న‌కు ఈగ‌ల్ టీం కృషి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. గ‌తంలోనూ ఇత‌ర రాష్ట్రాల్లోకి వెళ్లి మ‌రీ డ్ర‌గ్స్ ముఠాల‌ను ప‌ట్టుకుని కేసులు న‌మోదు చేసింది. రాష్ట్రంలోనూ అనేక దాడులు నిర్వ‌హించి గంజాయి ముఠాల‌కు చెక్ పెట్టింది.

Next Story