- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆగ్రాలో తెలంగాణ ఈగల్ టీమ్ భారీ ఆపరేషన్
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా నగరంలో తెలంగాణ ఈగల్ టీమ్ భారీ ఆపరేషన్ చేపట్టింది. హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఆగ్రా డ్రగ్స్ డెడ్‌ను గుర్తించింది.

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా నగరంలో తెలంగాణ ఈగల్ టీమ్ భారీ ఆపరేషన్ చేపట్టింది. హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఆగ్రా డ్రగ్స్ డెడ్‌ను గుర్తించింది. ఆదివారం పక్కా ప్రణాళికతో ఎటాక్ చేసింది. భారీ ఎత్తున మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుంది. పది కేజీల మెపిడ్రిన్, వెయ్యి లీటర్ల ముడిసరుకు సీజ్ చేసింది. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి.. ఆగ్రా పోలీసులకు అప్పజెప్పింది. గంజాయి, డ్రగ్స్ రహిత తెలంగాణను తయారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇక నుంచి రాష్ట్రంలో డ్రగ్స్ అమ్మినా.. కొనుగోలు చేసినా కఠినంగా శిక్షిస్తామని సీఎం రేవంత్ హెచ్చరించారు. నార్కోటిక్ బ్యూరోను ఇకపై 'ఈగల్'గా పిలుస్తామని.. ఎక్కడ గంజాయి కనిపించినా ఈ ఈగల్ పట్టుకుంటుందన్నారు. గంజాయిని గమనించినా.. డ్రగ్స్ ఆనవాళ్లను పరిశీలించినా.. క్షణంలోనే పట్టేస్తాయన్నారు. డ్రగ్స్ సరఫరాదారులపై, వినియోగదారులపై నిరంతరం నిఘా ఉంచుతామని ఇక నుంచి వారికి నిద్రలేని రాత్రులేనని అన్నారు. డ్రగ్స్ మహమ్మారిని రాష్ట్రం నుంచి సమూలంగా నిర్మూలిస్తామని స్పష్టం చేశారు. ఈగల్ వ్యవస్థ డ్రగ్స్ నెట్‌వర్క్‌లను పసిగట్టి.. వేగంగా చర్యలు తీసుకుంటుందని వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విధంగానే.. ఈగల్ టీమ్ దేశమంతా జల్లెడ పడుతోంది. దేశంలోని ఏ మూలనుంచి డ్రగ్స్ వచ్చినా.. ఆ మూలకు వెళ్లి.. మూలాల నుంచే ప్రక్షాళన చేస్తోంది.






