కన్నతల్లిపై టీనేజ్ బాలికలు హత్యయత్నం.. విషయం తెలిస్తే షాక్ అవుతారు!

by D.Reddy |   ( Updated:2025-03-29 07:13:20.0  )
కన్నతల్లిపై టీనేజ్ బాలికలు హత్యయత్నం.. విషయం తెలిస్తే షాక్ అవుతారు!
X

దిశ, వెబ్ డెస్క్: రోజు రోజు సమాజంలో ఘోరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తమ సంతోషాలకు అడ్డు వస్తున్నారని, తల్లి.. తండ్రి.. కొడుకు.. కూతురు.. అన్న.. అక్క.. ఇలా రక్తసంబంధాలను కూడా పట్టించుకోకుండా హతమారుస్తున్నారు. తాజాగా అమెరికాలోని టెక్సాస్‌లో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. నవమాసాలు మోసి, జన్మనిచ్చిదనే కనికరం కూడా లేకుండా కన్నతల్లినే చంపేందుకు సిద్ధమయ్యారు ఆ కూతుళ్లు.

వివరాల్లోకి వెళ్లితే.. టెక్సాస్‌కు చెందిన 39 ఏళ్ల మహిళకు 14, 15, 16 ఏళ్ల వయసున్న ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. అయితే, తరచూ వైఫ్ ఆఫ్ చేస్తుందని ఆ ముగ్గురు కూతుళ్లు తమ తల్లిపై కక్ష పెంచుకున్నారు. తమ తల్లిని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని, చంపేందుకు సిద్ధమయ్యారు. తమ ఇంట్లోని వంట గదిలో ఉన్న కత్తులతో తల్లిపై దాడికి దిగారు. తల్లి తప్పించుకుని వీధిలోకి పరుగెత్తగా, వారు కూడా వెంబడించారు. ఈ క్రమంలో ముగ్గురు బాలికల్లో ఓ బాలిక ఇటుక విసరటంతో తల్లికి గాయమైంది. బాలికల అమ్మమ్మ రక్షించేందుకు ప్రయత్నించగా ఆమెకు గాయాలయ్యాయి. సమాచారం అందుకు పోలీసులు బాలికలను అదుపులోకి తీసుకుని, హత్యయత్నానికి వినియోగించిన కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు బాలికలపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.



Next Story

Most Viewed