- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరకట్న వేధింపులు..కూతురుతో కలిసి ఆత్మహత్య చేసుకున్న లెక్చరర్
నోయిడాలో వరకట్న వేధింపులతో భార్యను సజీవదహనం చేసిన ఘటన మరవకముందే రాజస్థాన్‌లో విషాదం చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: నోయిడాలో వరకట్న వేధింపులతో భార్యను సజీవదహనం చేసిన ఘటన మరవకముందే రాజస్థాన్‌లో విషాదం చోటు చేసుకుంది. వరకట్న వేధింపుల కారణంగా ఓ లెక్చరర్ తన మూడేళ్ల కుమార్తెతో కలిసి సూసైడ్ చేసుకుంది. జోధ్‌పూర్‌లో నివాసం ఉంటున్న సంజు బిష్ణోయ్ ప్రభుత్వ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తోంది. కాగా శనివారం ఉదయం కూతురుతో కలిసి నిప్పంటించుని ఆత్మహత్యకు పాల్పడగా చిన్నారి అక్కడికక్కడే మరణించింది.
తీవ్రగాయాలైన సంజు బిష్ణోయ్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూసింది. కాగా వరకట్న వేధింపుల కారణంగానే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త దిలీప్ బిష్ణోయ్, అత్త మామ కలిసి తమ కూతురును వేధించారని పేర్కొన్నారు. పదేళ్ల క్రితం వివాహం జరగ్గా మొదటి నుండి నిరంతరం వేధింపులకు గురి చేస్తూనే ఉన్నారని ఆరోపించారు. నాలుగు నెలల క్రితం కూడా గొడవలు జరిగాయని చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.






