రిటైర్మెంట్ వయసు వచ్చినా బుద్ధిరాలేదు

by Ajay Maddhiboyina |

విద్యాబుద్ధులు నేర్పించాల్సి ఓ టీచర్ తన గురువు తనానికి ఉన్న గౌరవాన్ని మర్చిపోయాడు. సమాజం అంతా తనను గురువుగానే చూస్తారని ఎంతో అభిమానిస్తారని ఆలోచించకుండా అత్యంత నీచమైన పనికి పాల్పడ్డాడు.

రిటైర్మెంట్ వయసు వచ్చినా బుద్ధిరాలేదు
X

దిశ, వెబ్ డెస్క్: విద్యాబుద్ధులు నేర్పించాల్సి ఓ టీచర్ తన గురువు తనానికి ఉన్న గౌరవాన్ని మర్చిపోయాడు. సమాజం అంతా తనను గురువుగానే చూస్తారని ఎంతో అభిమానిస్తారని ఆలోచించకుండా అత్యంత నీచమైన పనికి పాల్పడ్డాడు. వయసు పెరిగినకొద్దీ మెదడు పనితనం తగ్గిందో ఏమో కానీ రిటైర్మెంట్ వయసులో చిన్నారిపై దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఏపీలో చోటు చేసుకుంది. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని ఓ ప్రైమరీ స్కూల్ లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సుబ్బారెడ్డి మద్యం మత్తులో స్కూలుకు వచ్చాడు. మద్యం మత్తులో స్కూలుకు రావడం మాత్రమే కాకుండా నాలుగవ తరగతి చదువుతున్న చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

ఇంటికి వెళ్లిన తరవాత విద్యార్థిని జరిగిన విషయాన్ని ఏడుస్తూ తన తల్లిదండ్రులకు చెప్పుకుంది. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు స్కూల్ కు వెళ్లి సుబ్బారెడ్డిని నిలదీశారు. ఆ సమయంలోనూ ఫుల్లుగా తాగి ఉన్న సుబ్బారెడ్డి మరింత దురుసుగా ప్రవర్తిస్తూ చిన్నారి తల్లిపై దాడికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో అక్కడ ఉన్న గ్రామస్తులు అతడిని చితకబాదారు. అనంతరం పోరుమామిళ్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సుబ్బారెడ్డి తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడిని ఉద్యోగం నుండి తొలగించాలని విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రిటైర్మెంట్ దగ్గర పడుతున్న సమయంలో టీచర్ ప్రవర్తనపైనా మండిపడుతున్నారు.

Next Story