హైదరాబాద్‌లో దారుణం.. ఏడేళ్ల బాలుడిని అట్లకాడతో కాల్చిన ట్యూషన్ టీచర్

by Ajay Maddhiboyina |

చదువు చెబుతుందని ట్యూషన్‌కు పంపిస్తే ఓ టీచర్ ఏడేళ్ల బాలుడిపై దారుణానికి పాల్పడింది. అట్లకర్రతో ఒళ్లంతా వాతలు పెట్టింది. ఈ అమానుష ఘటన హైదరాబాద్‌లోని ఫిలింనగర్

హైదరాబాద్‌లో దారుణం.. ఏడేళ్ల బాలుడిని అట్లకాడతో కాల్చిన ట్యూషన్ టీచర్
X

దిశ, వెబ్ డెస్క్: చదువు చెబుతుందని ట్యూషన్‌కు పంపిస్తే ఓ టీచర్ ఏడేళ్ల బాలుడిపై దారుణానికి పాల్పడింది. అట్లకర్రతో ఒళ్లంతా వాతలు పెట్టింది. ఈ అమానుష ఘటన హైదరాబాద్‌లోని ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఓయూ కాలనీకి చెందిన 1వ తరగతి చదువుతున్న విద్యార్థి తేజ నందన్‌‌ను తల్లి దండ్రులు శ్రీ మానస అనే టీచర్ దగ్గరకు ట్యూషన్‌కు పంపిస్తున్నారు. అయితే బాలుడు చదవడంలేదని శ్రీ మానస శరీరమంతా అట్లకర్రతో వాతలు పెట్టింది.

కాళ్లు, చేతులు, ముఖంతో సహా ఎనిమిది చోట్ల వాతలు పెట్టింది. దీంతో బాలుడి చర్మం ఊడిపోయింది. కాలిపై తీవ్రగాయాలు కావడంతో బాలుడు నడవలేకపోతున్నాడు. విషయం తెలిసి తల్లిదండ్రులు ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ లో టీచర్ పై ఫిర్యాదు చేశారు. వైద్య పరీక్షల నిమిత్త బాలుడిని గోల్కొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. తమ కుమారుడికి వాతలు పెట్టిన టీచర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని తేజ నందన్ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story