ఏపీలో దారుణం..పార్క్ చేసిన బైక్ పక్కకి తోశాడని ఇంటికి వెళ్లి దాడి

by Ajay Maddhiboyina |

ఏపీలో దారుణం చోటు చేసుకుంది. పార్క్ చేసిన తన టూవీలర్ బైక్ పక్కకు తోసేశాడనే అనుమానంతో అనిల్ అనే యువకుడిపై తంబళ్లపల్లె టీడీపీ నాయకుడు మల్లికార్జున నాయుడు దాడి చేశాడు.

ఏపీలో దారుణం..పార్క్ చేసిన బైక్ పక్కకి తోశాడని ఇంటికి వెళ్లి దాడి
X

దిశ‌, వెబ్ డెస్క్: ఏపీలో దారుణం చోటు చేసుకుంది. పార్క్ చేసిన తన టూవీలర్ బైక్ పక్కకు తోసేశాడనే అనుమానంతో అనిల్ అనే యువకుడిపై తంబళ్లపల్లె టీడీపీ నాయకుడు మల్లికార్జున నాయుడు దాడి చేశాడు. అనిల్ ఇంట్లోకి వెళ్లి ఆగ్రహంతో పడిగుద్దులు గుద్దాడు. కాళ్లతో అతడి గుండెలపై తన్నుతూ బూతులు తిట్టాడు. మల్లికార్జున నాయుడుతో పాటు అతడి అనుచరుడు శశి సైతం అనిల్ పై చేయి చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి ఇంట్లో ఉన్న వ్యక్తిని కొట్టగా తన డ్రైవర్ రాజేష్‌తో దాన్ని వీడియో తీయించుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నిందితులను కఠినంగా శిక్షించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Next Story