టాస్క్‌ఫోర్స్ పోలీసుల తనిఖీలు.. రూ.25 లక్షల విలువైన ఈ-సిగరెట్లు సీజ్

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-21 12:33:22  IST  )

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశాల మేరకు డ్రగ్స్, గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.

టాస్క్‌ఫోర్స్ పోలీసుల తనిఖీలు.. రూ.25 లక్షల విలువైన ఈ-సిగరెట్లు సీజ్
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశాల మేరకు డ్రగ్స్, గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్రాన్ని డగ్స్ ఫ్రీ స్టేట్‌గా మార్చేందుకు నార్కొటిక్ బ్యూరో (Narcotics Bureau)తో పాటు టాస్క్‌ఫోర్స్ (Taskforce), ఈగల్ టీమ్ (Eagle Team)లు సంయుక్తంగా పని చేస్తున్నాయి. ఈ మేరకు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపడుతూ.. డగ్స్ పెడ్లర్లతో పాటు కొనుగోలుదారులను డైరెక్ట్‌గా జైలుకు పంపుతున్నారు. ఈ నేపథ్యంలోనే నగరంలో దుబాయ్ (Dibai) నుంచి అక్రమంగా ఈ-సిగరెట్లను రవాణా చేస్తున్నారనే పక్కా సమాచారం మేరకు రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు వారి నుంచి రూ.25 లక్షల విలువైన 6,800 విదేశీ సిగరెట్ బాక్సులు, 360 ఈ-సిగరెట్లను సీజ్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో తజుద్దీన్, సమీ, ముక్రం, ఖలీల్ అహ్మద్, సోహైల్ ఖాన్, మరొకరు ఉన్నారు. ఈ-సిగరెట్ల అక్రమ రవాణాలో ప్రధాన నిందితుడు ముంబైకి చెందిన అబ్దుల్లా శెట్టిగా ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు.

Next Story