- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రాలతో స్నేహితుడిని అమ్మాయిగా మార్చేసిన యువకుడు.. ఆపై హోటల్‌లో బంధించి అత్యాచారం
మధ్యప్రదేశ్ నర్మదాపురంలో వింత ఘటన చోటు చేసుకుంది. తాంత్రిక విద్యను నేర్చుకున్న ఓ యువకుడు.. క్లోజ్ ఫ్రెండ్‌పై ప్రయోగించాడనే ఆరోపణలు వస్తున్నాయి. మత్తుపదార్థాలు ఇచ్చి బలవంతంగా లింగ మార్పిడి చేయించిన అతను..

దిశ, వెబ్ డెస్క్ : మధ్యప్రదేశ్ నర్మదాపురంలో వింత ఘటన చోటు చేసుకుంది. తాంత్రిక విద్యను నేర్చుకున్న ఓ యువకుడు.. క్లోజ్ ఫ్రెండ్‌పై ప్రయోగించాడనే ఆరోపణలు వస్తున్నాయి. మత్తుపదార్థాలు ఇచ్చి బలవంతంగా లింగ మార్పిడి చేయించిన అతను.. పేరు, ఐడెంటిటీ పూర్తిగా మార్చేశాడు. పద్దెనిమిది రోజులు హోటల్ రూమ్‌లో బంధించి.. మంత్రాలు చేశాడని.. అత్యాచారానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. బయటకు చెప్తే చంపేస్తానని బెదిరించడంతో ఇన్ని నెలలు కామ్‌గా ఉన్నట్లు సమాచారం. కాగా నిందితుడు శుభమ్ యాదవ్‌పై కేసు నమోదైంది.
బాధితుడు భోపాల్‌లోని గాంధీ నగర్‌లో తనకు జరిగిన నష్టాన్ని ఆరు నెలల తర్వాత ఫిర్యాదు చేశాడు. భయంతో ఇన్నాళ్లు ఇంట్లోనే ఉండిపోయానని.. ఈ విషయాన్ని తాజాగా తల్లిదండ్రులకు కూడా చెప్పానని తెలిపాడు. ఆ తర్వాత నర్మదాపురం కోత్వాలీ పీఎస్‌కు కేసు ట్రాన్ఫర్ కాగా మూడు బృందాలు నిందితుడి కోసం గాలిస్తున్నాయి. ప్రస్తుతం అతను పరారీలో ఉండగా.. దీని వెనుక ఇంకెవరు ఉన్నారనే దానిపై లోతుగా దర్యాప్తు చేశాస్తామని తెలిపారు పోలీసులు.






