సంచలనం.. శుద్ధి, పూజల పేరుతో ఏడాదిన్నరగా అత్యాచారం.. మాంత్రికుడు ఇచ్చిన ట్విస్ట్‌కు మైండ్ బ్లాంక్..

by Sujitha Rachapalli |

బీహార్ సహర్సా జిల్లాలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పూజలు, శుధ్దీకరణ పేరుతో యువతిపై ఏడాదిన్నరగా అత్యాచారం చేస్తున్నాడు తాంత్రికుడు. ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా.. సంచలన

సంచలనం.. శుద్ధి, పూజల పేరుతో ఏడాదిన్నరగా అత్యాచారం.. మాంత్రికుడు ఇచ్చిన ట్విస్ట్‌కు మైండ్ బ్లాంక్..
X

దిశ, వెబ్ డెస్క్ : బీహార్ సహర్సా జిల్లాలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పూజలు, శుధ్దీకరణ పేరుతో యువతిపై ఏడాదిన్నరగా అత్యాచారం చేస్తున్నాడు తాంత్రికుడు. ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా.. సంచలన విషయాలు బయటకు వచ్చాయి. అరపట్టి గ్రామానికి చెందిన గోవింద్ ఝా తనకు మంత్రాలు వచ్చని చెప్పుకుని తిరుగుతుంటాడు. శుద్ధీకరణ పేరుతో వేలకు వేలు లాగుతుంటాడు.

ఈ క్రమంలోనే ఓ అమ్మాయి చేత శుద్ధి పేరుతో పూజలు చేయించాడు. ఆధ్యాత్మిక సాధన అంటూ ఆమెను ఒంటరిగా గదిలో ఉంచేలా చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. వీడియో రికార్డ్ చేశాడు. 2024 మార్చిలో ఈ ఘటన జరగ్గా.. ఇప్పటికీ అంటే దాదాపు ఏడాదిన్నరపాటుగా ఈ వీడియో చూపించి యువతిని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. రేప్ చేస్తున్నాడు. దీంతో విసిగిపోయిన అమ్మాయి.. ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆమెను రక్షించిన బంధువులు విషయమేంటని అడగ్గా.. పూర్తిగా వివరించడంతో.. పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టారు. దీంతో మాంత్రికుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Next Story