అధికారి వేధిస్తున్నాడు.. సెల్ఫీ వీడియో తీసుకుని ఎస్వీ జూపార్క్ ఉద్యోగి ఆత్మహత్యయత్నం

by Ajay Maddhiboyina |

అధికారులు వేధిస్తున్నారు అంటూ ఎస్వీ జూ పార్క్‌లో ఉద్యోగి ఆత్మహత్యయత్నం చేయడం కలకలం రేపింది. రేంజర్ వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సెల్ఫీ వీడియోలో ఏబీఓ హరిబాబు తెలిపాడు.

అధికారి వేధిస్తున్నాడు.. సెల్ఫీ వీడియో తీసుకుని ఎస్వీ జూపార్క్ ఉద్యోగి ఆత్మహత్యయత్నం
X

దిశ, వెబ్ డెస్క్: అధికారులు వేధిస్తున్నారు అంటూ ఎస్వీ జూ పార్క్‌లో ఉద్యోగి ఆత్మహత్యయత్నం చేయడం కలకలం రేపింది. రేంజర్ వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సెల్ఫీ వీడియోలో ఏబీఓ హరిబాబు తెలిపాడు. తాను రూ.11 లక్షలకు బంగారం నగలు తాకట్టు పెట్టి పనులు చేసినా రూ.25 లక్షల బిల్లులు ఇంకా విడుదల కాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

తనపైనే లేనిపోని నిందలు వేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. డబ్బులు అడిగితే బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని అన్నాడు. తాను అవినీతికి పాల్పడ్డానని ఆరోపణలు చేస్తున్నాడని చెప్పాడు. దీనిపై విచారణకు ఏసీబీకి ఇవ్వాలని కోరాడు. ఇప్పటి వరకు ఓపికపట్టానని ఆవేదన వ్యక్తం చేశాడు. కొత్త రేంజర్ వచ్చినప్పటి నుండి ప్రతి రూపాయి తానే పెట్టానని చెప్పాడు. తన చావుకు కారణం రేంజరే అని తెలిపారు. తాను చనిపోయినా తన డబ్బును ఇంటికి పంపాలని కోరాడు. video

Next Story