వ్య‌క్తి అనుమాన‌స్ప‌ద మృతి

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, ఉండ‌వెల్లి : వ్య‌క్తి అనుమాన‌స్ప‌ద స్థితిలో మృతి చెందిన ఘ‌ట‌న ఉండ‌వెల్లి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. ఎస్సై శేఖర్ తెలిపిన వివరాల ప్ర‌కారం.. కర్నూలు జిల్లా ప్రకాష్ నగర్ కు చెందిన బోయ

వ్య‌క్తి అనుమాన‌స్ప‌ద మృతి
X

దిశ‌, ఉండ‌వెల్లి : వ్య‌క్తి అనుమాన‌స్ప‌ద స్థితిలో మృతి చెందిన ఘ‌ట‌న ఉండ‌వెల్లి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. ఎస్సై శేఖర్ తెలిపిన వివరాల ప్ర‌కారం.. కర్నూలు జిల్లా ప్రకాష్ నగర్ కు చెందిన బోయ మద్దిలేటి (50) అక్టోబర్ 27న తన కూతురును తీసుకొని రైలులో హైదరాబాద్ కు వెళ్ళాడు. మద్దిలేటి ని తిరిగి నవంబర్ 1న అల్లుడు రైలు ఎక్కించి కర్నూలు కు పంపించాడు. రాత్రి అయినా మద్దిలేటి ఇంటికి రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. సోమవారం రాత్రి జోగులాంబ రైల్వే హల్ట్ దగ్గర ఎస్వీఆర్ వెంచర్ లో గుర్తు తెలియని మగ మనిషి మృతదేహం ను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విచారించగా కర్నూలు కు చెందిన బోయ మద్దిలేటి గా గుర్తించారు. తన భర్త మద్దిలేటి కి మతిస్థిమితం లేక బిపి, షుగర్, మూర్ఛ వంటి వ్యాధులతో పాటుగా కల్లు తాగే అలవాటు ఉండ‌టం వ‌ల్ల‌ మృతి చెంది ఉంటాడనే భార్య మద్దమ్మ పిర్యాదు చేసింది. ఆమె మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Next Story