- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనుమానాస్పద రీతిలో వ్యక్తి మృతి..
అనుమానాస్పద రీతిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని నాగారం గ్రామ శివారులో గురువారం చోటు చేసుకుంది.

దిశ,వలిగొండ: అనుమానాస్పద రీతిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని నాగారం గ్రామ శివారులో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగారం గ్రామ శివారులోని హెచ్ పి పెట్రోల్ బంక్ సమీపంలో చిట్యాలకు- భువనగిరి ప్రధాన రహదారి వెళ్లే పక్కన రాత్రి 1 గంట 30 నిమిషాలకు రోడ్డు పక్కన ఒక కారు ఆగి ఉండటాన్ని గమనించిన స్థానిక పోలీసులు అనుమానంతో కారును తనిఖీ చేశారు.
డ్రైవర్ సీట్లో ఉన్న వ్యక్తి అప్పటికే మరణించి ఉన్నాడని, మృతుని వద్ద లభించిన ఆధార్ కార్డు, లైసెన్స్ వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, దర్శి మండలం, శివరాజ్ నగర్ కు చెందిన బండారి కృష్ణ(40) తండ్రి నరసింహగా ఆధారాలు లభ్యమయ్యాయి. అయితే మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై యుగేంధర్ గౌడ్ తెలిపారు.






