- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Suspicious Death: బాసర పుణ్యక్షేత్రంలో దారుణం.. వేద విద్యార్థి అనుమానాస్పద మృతి
అనుమానాస్పద స్థితిలో ఓ వేద విద్యార్థి మృతిచెందిన విషాద ఘటన నిర్మల్ జిల్లా (Nirmala District) బాసర (Basara) పుణ్యక్షేత్రంలో చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్/బాసర: అనుమానాస్పద స్థితిలో ఓ వేద విద్యార్థి మృతి చెందిన విషాద ఘటన నిర్మల్ జిల్లా (Nirmala District) బాసర (Basara) పుణ్యక్షేత్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా కేంద్రానికి చెందిన మణికంఠ (Manikanta) (16) అనే విద్యార్థి వేద పాఠశాలలో 3వ సంవత్సరం చదువుతున్నాడు. అయితే, ఇవాళ ఉదయం పాఠశాల నుంచి అదృశ్యమైన అతడు గంగా హారతి ఘాట్ (Ganga Aarti Ghat) వద్ద శవమై కనిపించాడు. కాగా, గత 21న ఓ వేద విద్యార్థిపై దాడి ఘటన మరువక ముందే తాజాగా అదే పాఠశాలలో విద్యార్థి చనిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అదేవిధంగా పాఠశాలలో సీసీ ఫుటేజ్ మొత్తం మాయం అయినట్లుగా సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story






