భారత వెబ్‌సైట్లను హ్యాక్‌ చేసిన నిందితులు అరెస్ట్

by Ajay Maddhiboyina |

గుజ‌రాత్‌లో ఇద్దరు హ్యాకర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందులో ఓ మైనర్ సహా అన్సారీ అనే మరో వ్యక్తి ఉన్నాడు. పలు భారత వెబ్ సైట్లను నిందితులు హ్యాక్ చేసినట్టు ఏటీఎస్ పోలీసులు గుర్తించారు.

భారత వెబ్‌సైట్లను హ్యాక్‌ చేసిన నిందితులు అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: గుజ‌రాత్‌లో ఇద్దరు హ్యాకర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందులో ఓ మైనర్ సహా అన్సారీ అనే మరో వ్యక్తి ఉన్నాడు. పలు భారత వెబ్ సైట్లను నిందితులు హ్యాక్ చేసినట్టు ఏటీఎస్ పోలీసులు గుర్తించారు. ఆపరేషన్ సిందూర్ జరుగుతున్న సమయంలో నిందితులు వెబ్ సైట్లను హ్యాక్ చేసి భారత వ్యతిరేక సందేశాలు పోస్ట్ చేసినట్టు గుర్తించారు. అంతే కాకుండా టెలిగ్రామ్ లో ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకుని హ్యాకర్లు అందులో కార్యకలాపాలు సాగించినట్టు తేలింది.

అంతే కాకుండా ఇంటర్ ఫైయిల్ అయినప్పటికి హ్యాకింగ్ పై నింధితులకు ఉన్న పట్టు చూసి పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. అరెస్ట్ చేసిన అనంతరం నింధితుల ఫోన్లను పోలీసులకు ఫోరెన్సిక్ ల్యాబులకు పంపించారు. ఆ ఫోన్లలోని సమాచారాన్ని బట్టి మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆపరేషన్ సిందూర్ సమయంలో చాలా మంది దేశంలో ఉంటూనే దేశద్రోహ చర్యలకు పాల్పడ్డారు. కొందరు బహిరంగంగా పోస్టులు పెడితే మరికొందరు దొరకకుండా ఫేక్ అకౌంట్లతో భారత్ కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. దీంతో నిఘా వర్గాలు ఒక్కొక్కరినీ అదుపులోకి తీసుకుంటున్నారు.

Next Story