హత్యకు 15 లక్షల సుపారీ.. రౌడీషీటర్ మర్డర్ కు ప్లాన్‌.. కానీ..!

by Bhanu |

ఒక రౌడీషీటర్‌ను హత్య చేసేందుకు రూ.15 లక్షల సుపారీ ఇచ్చిన ఘటనలో హైదరాబాద్ సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్

హత్యకు 15 లక్షల సుపారీ.. రౌడీషీటర్ మర్డర్ కు ప్లాన్‌.. కానీ..!
X

దిశ, సిటీక్రైం: ఒక రౌడీషీటర్‌ను హత్య చేసేందుకు రూ.15 లక్షల సుపారీ ఇచ్చిన ఘటనలో హైదరాబాద్ సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. జైలు నుంచి పెరోల్‌పై విడుదలైన రౌడీషీటర్‌పై ప్రతీకారం తీర్చుకోవాలన్న మంతనాల్లో ఈ హత్యాయత్నం రూపుదిద్దుకుంది.

పోలీసుల కథనం ప్రకారం... ఫలక్‌నుమాకు చెందిన రియల్‌ఎస్టేట్ వ్యాపారుడు సయ్యద్ ఫయాజ్ తన అనుచరులు సయ్యద్ జఫర్‌ఉద్దీన్, మొహమ్మద్ ఖలీం‌ఉద్దీన్, మొహమ్మద్ ఇబ్రహీం, సయ్యద్ యూనుస్‌లతో కలిసి ల్యాండ్ సెటిల్మెంట్లలో నిమగ్నంగా ఉన్నాడు. ఇదే క్రమంలో దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన రౌడీషీటర్ ముజాహిద్ అలియాస్ ముజ్జుతో ఆర్థిక వివాదాలు తలెత్తాయి.

ఇటీవల ముజ్జు ఓ వ్యక్తి హత్య కేసులో జైలుకు వెళ్లాడు. ఇటీవల పెరోల్‌పై బయటికి వచ్చిన ముజ్జు, ఫయాజ్‌ను టార్గెట్ చేస్తున్నాడన్న సమాచారం అందడంతో, ముందస్తుగా చర్యలు తీసుకుంటూ ఫయాజ్ అతన్ని హత్య చేయించేందుకు రూ.15 లక్షల సుపారీ ఇవ్వాలని ఒప్పందం చేశాడు. ఇందులో భాగంగా 40 వేల రూపాయలు అడ్వాన్స్‌గా చెల్లించాడు.

ఈ హత్యా కుట్ర సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి నగదు, మొబైల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. విచారణ కొనసాగుతున్నట్టు పోలీసులు తెలిపారు.


Next Story