suicide : భర్త వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్య

by Sridhar Babu |
suicide : భర్త వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్య
X

దిశ, ముత్తారం : మండలంలోని అమరాబాద్ కు చెందిన బిస్కుల సమత (21) భర్త వేధింపులు భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు, ముత్తారం ఎస్సై గోపతి నరేష్ తెలిపిన వివరాల ప్రకారం భూపాల్ పల్లి జిల్లా మలహర్రావు మండలం మల్లారం గ్రామానికి చెందిన సమత ముత్తారం మండలంలోని అమరాబాదుకు చెందిన బిస్కుల సంతోష్ ను రెండు సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. మృతురాలికి పది నెలల బాబు ఉన్నాడు.

గత సంవత్సరం నుంచి మృతురాలి భర్త సంతోష్ వరకట్నం తీసుకురావాలని ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించసాగాడు. దాంతో ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకోగా గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం కరీంనగర్ కు తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. తన కూతురు మరణానికి తన అల్లుడు బిస్కుల సంతోష్ కారణమని మృతురాలి తల్లి చేద లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ముత్తారం ఎస్సై నరేష్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed