suicide:ఉపాధి లేక వ్యక్తి ఆత్మహత్య

by Sridhar Babu |

ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య (suicide) చేసుకున్న ఘటన శనివారం మండలంలో చోటు చేసుకుంది.

suicide:ఉపాధి లేక వ్యక్తి ఆత్మహత్య
X

దిశ, కొడిమ్యాల : ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య (suicide) చేసుకున్న ఘటన శనివారం మండలంలో చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని బొల్లం చెరువు గ్రామానికి చెందిన గుమ్మాడిదారి రాజేషం (52) (Gummadidari Rajesham)గత కొద్ది కాలంగా అప్పుల బాధతో సతమత మవుతున్నాడు.

ఉపాధి లేదని బాధపడుతున్న క్రమంలో శుక్రవారం ఉదయం జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు సేవించాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు జగిత్యాల ఏరియా హాస్పిటల్ కు చికిత్స నిమిత్తం తరలించారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం మరణించాడు. మృతుని భార్య అనసూయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ హర్శరాజు తెలిపారు.

Next Story