- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోర్టు తీర్పు ఏమొస్తుందో అని బెంగతో ఆత్మహత్య
తనపై కోర్టులో ఉన్న ఓ కేసులో తుది తీర్పు ఏ విధంగా వస్తుందో అనే బెంగతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

దిశ, సంగారెడ్డి : తనపై కోర్టులో ఉన్న ఓ కేసులో తుది తీర్పు ఏ విధంగా వస్తుందో అనే బెంగతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా కంది మండలంలో గురువారం రాత్రి జరిగింది. రూరల్ ఎస్సై మధుసూదన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్దనూర్ గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల నవీన్ (27) స్థానికంగా పెయింటర్ గా పనిచేస్తున్నాడు. నర్సాపూర్ పరిధి ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయి విషయంలో కొంతకాలం క్రితం ఇతడిపై పోక్సో కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అతడికి ఈ నెల 28న కోర్టులో తుది తీర్పు కొరకు హాజరు అయ్యేది ఉంది. కాగా తనపై తీర్పు ఏ విధంగా వస్తుందో అని ఆవేదనతో దిగులు చెంది ఈ నెల 23న రాత్రి 10 గంటలకు అతడు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే మృతుడు ఏ కేసులో అయితే నిందితుడిగా ఉన్నాడో అదే అమ్మాయిని రెండు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక సంవత్సరన్నర పాప కూడా ఉన్నది.






