- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గడ్డి మందు తాగి యువకుని ఆత్మహత్య..
by Batti.Sumithra |
లక్షెట్టిపేట పట్టణంలోని ఊత్కూర్ చౌరస్తాలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను నిర్వహించే పొన్నం అన్వేష్ (24) అనే యువకుడు గడ్డిమందు తాగి చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు.

X
దిశ, లక్షెట్టిపేట : లక్షెట్టిపేట పట్టణంలోని ఊత్కూర్ చౌరస్తాలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను నిర్వహించే పొన్నం అన్వేష్ (24) అనే యువకుడు గడ్డిమందు తాగి చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. స్థానిక ఎస్సై లక్ష్మణ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జగిత్యాల జిల్లా గుల్లకోట గ్రామానికి చెందిన మృతుడు ఇక్కడి చౌరస్తాలో ఓ గదిని అద్దెకి తీసుకొని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను నిర్వహిస్తున్నాడు. సెంటర్ నడకపోవడంతో ఆర్థిక స్తోమత కుంటుబడి మనస్తాపం చెందిన యువకుడు ఈ నెల 29న గడ్డి మందు తాగాడు. చికిత్స నిమిత్తం కరీంనగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడని ఎస్సై తెలిపారు. ఈ మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Next Story






