Suicide: రాష్ట్రంలో తీవ్ర విషాదం.. లోన్‌ యాప్ వేధింపులతో యువకుడి బలవన్మరణం

by Kema Shiva Kumar |   (  Updated:2024-12-10 06:51:09  IST  )

లోన్ యాప్ (Loan Aap) వేధింపులు తట్టుకోలేక ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన విశాఖపట్నం (Vishakhapatnam)లో చోటుచేసుకుంది.

Suicide: రాష్ట్రంలో తీవ్ర విషాదం.. లోన్‌ యాప్ వేధింపులతో యువకుడి బలవన్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: లోన్ యాప్ (Loan Aap) వేధింపులు తట్టుకోలేక ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన విశాఖపట్నం (Vishakhapatnam)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పట్టణానికి చెందిన నరేంద్ర (Narendra) అనే వ్యక్తి ఇటీవలే ఓ ప్రైవేటు సంస్థకు చెందిన లోన్ యాప్ నుంచి రూ.2 వేల లోన్ తీసుకున్నాడు. ఈ క్రమంలోనే అప్పు తీర్చలేదంటూ యాప్ యాజమాన్యం నరేంద్రపై బెదిరింపులకు పాల్పడింది. అక్కడితో ఆగకుండా ఏకంగా తన ఫోటోలను మార్ఫింగ్ చేసి బంధువులకు పంపారు. అయితే, నెల రోజుల క్రితమే బాధితుడు నరేంద్రకు వివాహం అయినట్లుగా తెలుస్తోంది. అయితే, లోన్ యాప్ యాజమాన్యం వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గరైన నరేంద్ర ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story