- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అకస్మాత్తుగా బ్రేకులు ఫెయిల్.. నగరంలో టిప్పర్ బీభత్సం
by Kema Shiva Kumar |
బ్రేకులు ఫెయిల్ అయి టిప్పర్ బీభత్సం సృష్టించిన ఘటన నగరంలో ఈరోజు తెల్లవారుజామున చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: బ్రేకులు ఫెయిల్ అయి టిప్పర్ బీభత్సం సృష్టించిన ఘటన నగరంలో ఈరోజు తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మలక్‌పేట నుంచి దిల్‌సుఖ్‌నగర్ వైపు వెళ్తున్న ఓ టిప్పర్‌కు తిరుమల హిల్స్ వద్దకు రాగానే అకస్మాత్తుగా బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. అనంతరం వేగాన్ని అదుపు చేయలేకపోయిన డ్రైవర్ ముందు ఉన్న డివైడర్‌తో పాటు ఆ పక్కనే ఉన్న లారీ, బస్సును కూడా బలంగా ఢీకొట్టాడు. దీంతో కాసేపు ఆ రూట్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ దుర్ఘటనలో మొత్తం మూడు వాహనాలు దెబ్బతిన్నాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు రోడ్డు మధ్యలో అడ్డంగా ఉన్న టిప్పర్‌తో పాటు లారీ, బస్సును పక్కకు తప్పించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.
Next Story






