బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద డ్యూటీ చేసి వెళ్తుండగా ప్రమాదం.. SI దుర్మరణం

by Gantepaka Srikanth |

సంగారెడ్డి జిల్లా చేరియాల్‌గుట్ట దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. అతివేగంతో వచ్చి కారు - లారీ ఢీకొన్నాయి.

బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద డ్యూటీ చేసి వెళ్తుండగా ప్రమాదం.. SI దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: సంగారెడ్డి జిల్లా చేరియాల్‌గుట్ట దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. అతివేగంతో వచ్చి కారు - లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఫిల్మ్ నగర్ ఎస్‌ఐ రాజేశ్వర్ అక్కడిక్కడే దుర్మరణం(SI Dead) చెందారు. బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద బందోబస్తు నిర్వహించి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. విషయం తెలిసిన వెంటనే స్పాట్ వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని ప్రమాదానికి సంబంధించిన వివరాలపై ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరోవైపు.. బుధవారం రాత్రి కన్నుల పండుగగా బల్కంపేట ఎల్లమ్మ తల్లి రథోత్సవం జరిగింది. టీపీసీసీ అధికార ప్రతినిధి కోట నీలిమ, హైదరాబాద్ కలెక్టర్ హరిచందనలతో కలిసి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ సతీమణి సుధ దెబ్బర్మ చేతుల మీదుగా రథోత్సవం జరిగింది. వేలాది భక్తుల మధ్య పటిష్టమైన పోలీస్ బందోబస్తుతో బోనాలు పెట్టారు.

Next Story