Students Died: రాష్ట్రంలో తీవ్ర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి

by Kema Shiva Kumar |

పండుగ పూట రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

Students Died: రాష్ట్రంలో తీవ్ర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: పండుగ పూట రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సముద్ర స్నానానికి వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతైన ఘటన అనకాపల్లి (Anakapally) జిల్లాలో ఇవాళ ఉదయం జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఎస్.రాయవరం (S Rayavaram) మండల పరిధిలోని రేవు పోలవరం (Revu Polavaram) తీరంలో కనుమ పండుగ సందర్భంగా కాకర మణికంఠ (18), పసనబోయిన సాద్విక్ (10) సముద్ర స్థానానికి వెళ్లారు. అయితే, అలల ఉధృతితో వారు సముద్రంలోకి కొట్టుకుపోయారు. ఈ దుర్ఘటనలో మణికంఠ, సాద్విక్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. అయితే, మృతులు తుని (Tuni) మండల పరిధిలోని లోవకొత్తూరు (Lova Kotthur) గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.

Next Story