- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మనసు గాయపడేలా తిట్టిన టీచర్?.. కాలేజీ బిల్డింగ్ పైనుంచి దూకిన స్టూడెంట్
ఖమ్మం జిల్లా బోనకల్లు మండల కేంద్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అధ్యాపకురాలు దూషించిందనే మనస్తాపంతో ఎస్సీ బాలికల గురుకుల కాలేజీ బిల్డింగ్ పైనుంచి విద్యార్థిని దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం జిల్లా బోనకల్లు మండల కేంద్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అధ్యాపకురాలు దూషించిందనే మనస్తాపంతో ఎస్సీ బాలికల గురుకుల కాలేజీ బిల్డింగ్ పైనుంచి విద్యార్థిని దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కాలేజీ సిబ్బంది హుటాహుటిన ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. విషయం తెలిసిన పోలీసులు కాలేజీకి వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడేలా దూషించిన టీచర్‌ను విచారిస్తున్నట్లు సమచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి నాగ వెంకట్ రెడ్డి (20) రోడ్డు ప్రమాదంలో మరణించడం స్థానికంగా కలకలం రేపింది. శుక్రవారం గుంటూరు హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకుంటాడనుకున్న కుమారుడు ఇలా శవమై తిరిగి రావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.






