ప‌ట్ట ప‌గ‌లే విద్యార్థుల‌పై క‌త్తుల‌తో దాడి..షాకింగ్ వీడియో వైర‌ల్

by velandi.Saikiran |

పూణేలోని వాఘోలి ప్రాంతంలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల మధ్య పాత కక్షలు తెరపైకి వచ్చాయి.

ప‌ట్ట ప‌గ‌లే విద్యార్థుల‌పై క‌త్తుల‌తో దాడి..షాకింగ్ వీడియో వైర‌ల్
X

దిశ‌, వెబ్ డెస్క్‌: దేశంలో రోజు రోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. పోలీస్ శాఖ ఎన్ని కఠినమైన రూల్స్ తీసుకువచ్చినప్పటికీ, క్రైమ్ రేట్ విపరీతంగానే పెరుగుతోంది. అయితే తాజాగా పూణేలోని వాఘోలి అనే ప్రాంతంలో పట్ట పగలే ఇద్దరు విద్యార్థులపై అత్యంత దారుణంగా దాడి చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

పట్ట పగలే విద్యార్థులపై దాడి

పూణేలోని వాఘోలి ప్రాంతంలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల మధ్య పాత కక్షలు తెరపైకి వచ్చాయి. దీంతో నాగేష్ అనే విద్యార్థిని టార్గెట్ చేశాడు మంగేష్ అనే కుర్రాడు. ఇద్దరి మధ్య పాత కక్షలు ఉన్న నేపథ్యంలో నాగేష్ పై దాడి చేయాలని చాలా రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తున్నాడట మంగేష్. ఇందులో భాగంగానే తాజాగా కాలేజ్ ముందు కూర్చున్న నాగేష్, అతని స్నేహితుడిపై మంగేష్ మరో ఇద్దరు అనుచరులు కత్తులతో దాడులు చేశారు.

ముందుగా మాట్లాడినట్లు నమ్మించి, ఆ తర్వాత దాడి చేశారు. ఈ సంఘటనలో నాగేష్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం నాగేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ సంఘటన వీడియో వైరల్ అయిన నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు, నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story