మెట్రో స్టేషన్‌ పై నుంచి దూకి బాలుడి ఆత్మహత్య.. కన్నీరు పెట్టిస్తున్న సూసైడ్ నోట్

by Sujitha Rachapalli |

* మెట్రో స్టేషన్‌ పై నుంచి దూకి పదో తరగతి బాలుడి ఆత్మహత్య * సూసైడ్ నోట్‌లో తన బాధను వివరించిన విద్యార్థి * కన్నీరు పెట్టిస్తున్న ఆత్మహత్య లేఖ

మెట్రో స్టేషన్‌ పై నుంచి దూకి బాలుడి ఆత్మహత్య.. కన్నీరు పెట్టిస్తున్న సూసైడ్ నోట్
X

దిశ, వెబ్ డెస్క్ : మెట్రో స్టేషన్ పై నుంచి దూకి పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రిన్సిపల్, ముగ్గురు ఉపాధ్యాయులు ఇందుకు కారణమైనట్లు తెలుస్తుండగా.. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఢిలలీలోని రాజేంద్ర ప్లేస్ మెట్రో స్టేషన్ పై నుంచి దూకాడు పదో తరగతి విద్యార్థి. దీంతో తీవ్ర గాయాలు కాగా వెంటనే బీఎల్‌కే మ్యాక్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ కన్నుమూశాడు. కాగా బాలుడి బ్యాగ్‌లో సూసైడ్ నోట్ లభించింది. ‘ సారీ మమ్మీ.. నిన్ను చాలా సార్లు బాధపెట్టాను.. ఇదే చివరిసారి. ఎవరైనా ఈ నోట్ చూస్తే ఈ నంబర్‌కు కాల్ చేయండి. నాపై స్కూల్లో మానసికంగా వేధింపులు ఎక్కువయ్యాయి. ప్రిన్సిపల్, ముగ్గురు టీచర్లు తీవ్రంగా టార్చర్ చేశారు’ అని రాసుకొచ్చాడు. దీంతో బాలుడి తండ్రి ఆత్మహత్యకు ప్రేరేపించిన స్కూల్ టీచర్స్, ప్రిన్సిపల్‌పై ఫిర్యాదు చేశాడు.

Next Story